Ponguru Narayana: మాజీ మంత్రి నారాయణ ఇంటికి ఏపీ సీఐడీ అధికారులు

హైదరాబాద్‌లో ఉంటున్న మాజీ మంత్రి పొంగూరు నారాయణ ఇంటికి ఏపీ సీఐడీ అధికారులు వెళ్లారు. అమరావతి ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు వ్యవహారంలో ఆయన వాంగ్మూలాన్ని అధికారులు నమోదు చేశారు.

Published : 18 Nov 2022 14:20 IST

హైదరాబాద్‌: హైదరాబాద్‌లో ఉంటున్న మాజీ మంత్రి పొంగూరు నారాయణ ఇంటికి ఏపీ సీఐడీ అధికారులు వెళ్లారు. అమరావతి ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు వ్యవహారంలో ఆయన వాంగ్మూలాన్ని అధికారులు నమోదు చేశారు. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో న్యాయవాదుల సమక్షంలో సీఐడీ అధికారులు నారాయణ వివరణ తీసుకున్నారు. 

ఇన్నర్ రింగ్ రోడ్ మాస్టర్ ప్లాన్‌లో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలతో సీఐడి అధికారులు గతంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా.. సాక్షిగా విచారణకు రావాలంటూ నారాయణకు సీఐడీ అధికారులు 160 సీఆర్‌పీసీ నోటీసు ఇచ్చారు. అయితే, ఈ నోటీసుపై ఆయన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అనారోగ్యంతో ఉన్నారని.. ఇటీవల శస్త్రచికిత్స జరిగిందని నారాయణ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. ఆయనకు 65 ఏళ్ల వయసు దాటిందని న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు. వాదనలు విన్న న్యాయస్థానం.. నారాయణను హైదరాబాద్‌లోని ఆయన  నివాసంలోనే న్యాయవాది సమక్షంలో విచారించుకోవచ్చని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలోనే ఏపీ సీఐడీ అధికారులు హైదరాబాద్‌ వచ్చి ఆయన వాంగ్మూలాన్ని నమోదు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని