Chandrababu: రాజధాని శంకుస్థాపన ప్రదేశంలో ప్రణమిల్లిన ఏపీ సీఎం చంద్రబాబు

రాజధాని ప్రాంతంలో ఏపీ సీఎం చంద్రబాబు పర్యటించారు. వైకాపా ప్రభుత్వ కక్ష సాధింపుతో నిర్లక్ష్యానికి గురైన పలు నిర్మాణాలు, రాజధాని ప్రాంత స్థితిగతుల్ని సీఎం తెలుసుకున్నారు.

Updated : 20 Jun 2024 17:11 IST

అమరావతి: రాజధాని ప్రాంతంలో ఏపీ సీఎం చంద్రబాబు పర్యటించారు. వైకాపా ప్రభుత్వ కక్ష సాధింపుతో నిర్లక్ష్యానికి గురైన పలు నిర్మాణాలు, రాజధాని ప్రాంత స్థితిగతుల్ని సీఎం తెలుసుకున్నారు. అమరావతి నిర్మాణాల పరిశీలనలో భాగంగా ఉండవల్లిలోని తన నివాసం నుంచి బయల్దేరారు. తొలుత ప్రజావేదిక శిథిలాలను సీఎం పరిశీలించారు. అనంతరం ఉద్దండరాయునిపాలెం వెళ్లారు. రాజధాని నిర్మాణానికి ప్రధాని మోదీ శంకుస్థాపన చేసిన ప్రాంతాన్ని సందర్శించారు. ఆ ప్రదేశంలో ప్రణమిల్లారు. మోకాళ్లపై కూర్చొని నమస్కరించారు. గతంలో సేకరించిన మట్టికి అక్కడ పూజలు చేశారు.

రాజధాని ప్రాంతంలో సీఎం పర్యటన నేపథ్యంలో పెద్ద ఎత్తున అమరావతి ప్రాంత రైతులు, తెదేపా కార్యకర్తలు తరలివచ్చారు. జై చంద్రబాబు, జై అమరావతి నినాదాలతో ఆ ప్రాంతం మార్మోగింది. శంకుస్థాపన ప్రాంతం పరిశీలిన అనంతరం సీడ్‌ యాక్సెస్‌ రోడ్, అసంపూర్తిగా మిగిలిన అఖిల భారత సర్వీసు అధికారులు, మంత్రులు, న్యాయమూర్తుల గృహ సముదాయాలను చంద్రబాబు పరిశీలించారు. సీఎం వెంట మంత్రులు నారాయణ, ఎమ్మెల్యేలు ధూళిపాళ్ల నరేంద్ర, కొలికపూడి శ్రీనివాసరావు తదితరులు ఉన్నారు.  పర్యటన అనంతరం మీడియాతో ఆయన మాట్లాడనున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని