Chandrababu: ఏపీలో చమురు శుద్ధి కర్మాగారం, పెట్రోకెమికల్‌ కారిడర్‌ ఏర్పాటుకు కృషి: చంద్రబాబు

ఏపీలో దాదాపు రూ.70 వేల కోట్ల పెట్టుబడితో చమురు శుద్ధి కర్మాగారం, పెట్రోకెమికల్‌ కారిడర్‌ ఏర్పాటుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందని సీఎం చంద్రబాబు (Chandrababu) తెలిపారు.

Updated : 10 Jul 2024 19:30 IST

అమరావతి: ఏపీలో దాదాపు రూ.70 వేల కోట్ల పెట్టుబడితో చమురు శుద్ధి కర్మాగారం, పెట్రోకెమికల్‌ కారిడర్‌ ఏర్పాటుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందని సీఎం చంద్రబాబు (Chandrababu) తెలిపారు. బుధవారం భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటిడ్‌(బీపీసీఎల్‌) ఛైర్మన్‌, ఎండీ కృష్ణకుమార్‌ నేతృత్వంలోని ప్రతినిధులతో సీఎం సమావేశమయ్యారు. ఈ భేటీకి సంబంధించిన వివరాలను సీఎం ‘ఎక్స్‌’ వేదికగా తెలిపారు.

‘‘దేశానికి తూర్పు తీరంగా ఉన్న ఏపీలో గణనీయమైన పెట్రోకెమికల్‌ సామర్థ్యం ఉంది. ఈ ప్రాజెక్టు కోసం 5వేల ఎకరాల భూమి అవసరమవుతుంది. అందుకే, 90 రోజుల్లో ఈ ప్రాజెక్టు సాధ్యాసాధ్యాలపై వివరణాత్మక ప్రణాళికతో కూడిన సమగ్ర నివేదిక ఇవ్వాలని సంస్థ ప్రతినిధుల్ని కోరా. ఇబ్బంది లేని పద్ధతిలో ఆ సంస్థకు సౌకర్యాలు కల్పించడానికి ఏపీ ప్రభుత్వం సిద్ధంగా ఉంది’’అని  చంద్రబాబు ట్వీట్‌ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని