పింగళి కుమార్తెను సన్మానించిన జగన్‌

జాతీయ పతాకాన్ని రూపొందించి వందేళ్లు పూర్తయిన సందర్భంగా దాని రూపశిల్పి పింగళి వెంకయ్య కుటుంబాన్ని శుక్రవారం ఏపీ సీఎం జగన్‌  కలిశారు...

Updated : 12 Mar 2021 16:01 IST

మాచర్ల : జాతీయ పతాకాన్ని రూపొందించి వందేళ్లు పూర్తయిన సందర్భంగా దాని రూపశిల్పి పింగళి వెంకయ్య కుటుంబాన్ని శుక్రవారం ఏపీ సీఎం జగన్‌  కలిశారు. గుంటూరు జిల్లా మాచర్లలో నివసిస్తున్న ఆయన కుమార్తె ఘంటసాల సీతామహాలక్ష్మిని ఈసందర్భంగా సన్మానించారు. పింగళి జీవిత విశేషాలతో కూడిన చిత్ర ప్రదర్శనను సీఎం తిలకించారు.  ముఖ్యమంత్రి స్వయంగా తమ నివాసానికి రావడంతో సీతామహలక్ష్మి కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ‘ఆజాదీ కా అమృత్‌’ మహోత్సవ్‌’ పేరిట కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఉత్సవాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని