CM Jagan: ప్రతి విద్యార్థి తలరాత మార్చాలని తపన పడుతున్నా: సీఎం జగన్‌

పేదరికం చదువుకు ఆటంకం కాకూడదని.. పిల్లలకు తల్లిదండ్రులు ఇచ్చే ఆస్తి చదువేనని ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ అన్నారు. అన్నమయ్య జిల్లా మదనపల్లెలో నిర్వహించిన విద్యా దీవెన పథకం నిధుల విడుదల కార్యక్రమంలో సీఎం జగన్‌ పాల్గొని మాట్లాడారు.

Published : 30 Nov 2022 14:00 IST

మదనపల్లె: పేదరికం చదువుకు ఆటంకం కాకూడదని.. పిల్లలకు తల్లిదండ్రులు ఇచ్చే ఆస్తి చదువేనని ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ అన్నారు. అన్నమయ్య జిల్లా మదనపల్లెలో నిర్వహించిన విద్యా దీవెన పథకం నిధుల విడుదల కార్యక్రమంలో సీఎం జగన్‌ పాల్గొని మాట్లాడారు. జులై-సెప్టెంబర్‌ త్రైమాసికానికి 11 లక్షల 2 వేల మంది విద్యార్థులకు రూ.684 కోట్ల విద్యాదీవెన నిధులను వారి తల్లుల ఖాతాల్లోకి జమ చేసినట్లు చెప్పారు.

పాదయాత్రలో ఇచ్చిన హామీలు తనకు గుర్తున్నాయని.. పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్ అమలు చేస్తున్నట్లు సీఎం చెప్పారు. విద్యా దీవెనతో పాటు వసతి దీవెన తీసుకొచ్చినట్లు తెలిపారు. ఈ రెండు పథకాల కోసం రూ.12,401 కోట్లు ఖర్చు పెట్టినట్లు పేర్కొన్నారు. విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొచ్చామని.. పిల్లల చదువుకు పెట్టే ఖర్చును వ్యయంగా కాకుండా ఆస్తిలా భావించాలన్నారు. ఎంత మంది పిల్లలున్నా వారి చదువుకయ్యే ఖర్చు తాను భరించనున్నట్లు స్పష్టం చేశారు. ప్రతి విద్యార్థి తలరాత మార్చాలని తపన పడుతున్నట్లు సీఎం జగన్‌ అన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు