ap cm Jagan: మంచి చేస్తున్న ప్రభుత్వానికి మీ ఆశీస్సులే శ్రీరామరక్ష: సీఎం జగన్‌

నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గ ఉప ఎన్నికలో వైకాపా అభ్యర్థి మేకపాటి విక్రమ్‌ రెడ్డి ఘన ఘనవిజయం సాధించారు.

Published : 26 Jun 2022 16:24 IST

అమరావతి: నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గ ఉప ఎన్నికలో వైకాపా అభ్యర్థి మేకపాటి విక్రమ్‌ రెడ్డి ఘన ఘనవిజయం సాధించారు. సమీప ప్రత్యర్థి, భాజపా అభ్యర్థి భరత్‌కుమార్‌ యాదవ్‌పై 82,742 ఓట్ల మెజారిటీతో విక్రమ్‌రెడ్డి గెలుపొందడంపై జగన్‌ హర్షం వ్యక్తం చేశారు. దేవుడి దీవెనలు, ప్రజల ఆశీస్సులతో విజయం సాధించామని ట్విటర్‌లో పేర్కొన్నారు. ‘‘ప్రభుత్వం చేసిన మంచికి మద్దతుగా, గౌతమ్‌కు నివాళిగా... ఆత్మకూరులో 83వేల భారీ మెజార్టీతో విక్రమ్‌ను దీవించిన ప్రతి అక్కకు, చెల్లెమ్మకు, సోదరుడికి, స్నేహితుడికి, అవ్వకు, తాతకు... పేరు పేరునా ధన్యవాదాలు. మంచి చేస్తున్న ప్రభుత్వానికి దేవుడి చల్లని దీవెనలు, మీ అందరి ఆశీస్సులే శ్రీరామరక్ష’’ అని జగన్‌ ట్విటర్‌లో పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని