cm jagan: అపాచీ పరిశ్రమ ఏర్పాటుతో 10వేల మందికి ఉద్యోగాలు: సీఎం జగన్‌

ఏపీ సీఎం జగన్‌ తిరుపతి జిల్లా పర్యటన ముగిసింది. శ్రీకాళహస్తి మండలం ఇనగలూరులో ఏర్పాటు చేయనున్న అపాచీ పరిశ్రమకు సీఎం జగన్‌ భూమిపూజ చేశారు. 15 నెలల్లోనే

Updated : 10 Aug 2022 11:10 IST

తిరుపతి: ఏపీ సీఎం జగన్‌ తిరుపతి జిల్లా పర్యటన ముగిసింది.శ్రీకాళహస్తి మండలం ఇనగలూరులో ఏర్పాటు చేయనున్న అపాచీ పరిశ్రమకు సీఎం జగన్‌ భూమిపూజ చేశారు. 15 నెలల్లోనే పరిశ్రమ అందుబాటులోకి వస్తుందన్న ఆయన 10వేల మందికి ఉపాధి లభిస్తుందన్నారు. రూ.800 కోట్లతో అపాచీ పరిశ్రమ రావడం ఆనందంగా ఉందన్నారు. ఏడాదిలో ఇనగలూరు రూపురేఖలు మారిపోతాయన్నారు. 80శాతం మంది స్థానికులకే ఉద్యోగాలు రానున్నాయని తెలిపారు. ఏదైనా సమస్య ఉందని ఫోన్‌ చేస్తే పరిష్కరిస్తామని పరిశ్రమ యాజమాన్యానికి సీఎం హామీ ఇచ్చారు. వికృతమాల ఈఎంసీ-1లో 3 పరిశ్రమలను సీఎం ప్రారంభించారు. తిరుపతిలో మరో రెండు పరిశ్రమలకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా పారిశ్రామిక వేత్తలతో ముఖాముఖి మాట్లాడిన సీఎం.. పారిశ్రామిక వేత్తలకు ఎల్లవేళలా అండగా ఉంటామన్నారు. కార్యక్రమంలో రాష్ట్రమంత్రులు గుడివాడ అమర్నాథ్‌, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అపాచీ పరిశ్రమ ప్రతినిధులు పాల్గొన్నారు.

వకుళామాత ఆలయాన్ని ప్రారంభించిన సీఎం

పేరూరులో నిర్మించిన వకుళామాత ఆలయం ప్రారంభోత్సవానికి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హాజరయ్యారు. అమ్మవారి విగ్రహ ప్రాణ ప్రతిష్ట, మహా సంప్రోక్షణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రోజా తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని