AP:22వేలు దాటిన కరోనా కేసులు

ఏపీలో కరోనా మహమ్మాని విలయతాండవం చేస్తోంది. రోజురోజుకూ పాజిటివ్‌ కేసులు పెరిగిపోతునే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో 89,087 నమూనాలను

Updated : 14 May 2021 18:27 IST

అమరావతి: ఏపీలో కరోనా మహమ్మాని విలయతాండవం చేస్తోంది. రోజురోజుకూ పాజిటివ్‌ కేసులు పెరిగిపోతునే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో 89,087 నమూనాలను పరీక్షించగా.. 22,018 మందికి పాజిటివ్‌గా తేలింది. దీంతో ఇప్పటి వరకు కరోనా సోకిన వారి సంఖ్య 13,88,803కి చేరింది. తాజాగా మరో 96 మంది కరోనాకు బలవ్వగా మొత్తం మృతుల సంఖ్య 9, 173కిపెరిగింది. తాజాగా 19,117 మంది కరోనా నుంచి కోలుకోగా.. ప్రస్తుతం రాష్ట్ర్రంలో 2,03,787 యాక్టివ్‌ కేసులు ఉన్నట్లు రాష్ట్రప్రభుత్వం బులిటెన్‌ విడుదల చేసింది. ఇప్పటి వరకు 1,77,91,220 నమూనాలను పరీక్షించినట్లు పేర్కొంది. అనంతపురంలో అత్యధికంగా 11 మంది, తూర్పుగోదావరి, విశాఖపట్నం, పశ్చిమగోదావరి జిల్లాల్లో 10 మంది, విజయనగరంలో 9 మంది, చిత్తూరు, కృష్ణ జిల్లాల్లో 8 మంది, గుంటూరు, నెల్లూరులో ఏడుగురు, కర్నూలు, శ్రీకాకుళం జిల్లాల్లో ఆరుగురు, కడప జిల్లాలో నలుగురు చొప్పున ప్రాణాలు కోల్పోయారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని