AP Corona Update: ఏపీలో కొత్తగా 1,115 కేసులు.. 19 మరణాలు

ఏపీలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 52,319 నమూనాలను పరీక్షించగా 1,115 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది.

Updated : 31 Aug 2021 17:13 IST

అమరావతి: ఏపీలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 52,319 నమూనాలను పరీక్షించగా 1,115 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 20,14,116కి చేరింది. తాజాగా ఆరుగురు కరోనా మహమ్మారికి బలవ్వగా.. మొత్తం మృతుల సంఖ్య 13,857కి పెరిగింది. మరోవైపు 1,265 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్ఛార్జి కాగా.. రాష్ట్రంలో ప్రస్తుతం 14,693 క్రియాశీల కేసులు ఉన్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఈ మేరకు బులిటెన్‌ విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 2,66,29,314 నమూనాలను పరీక్షించినట్లు అందులో పేర్కొంది. తాజాగా చిత్తూరు, కృష్ణా జిల్లా్ల్లో నలుగురు, నెల్లూరులో ముగ్గురు, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో ఇద్దరు, తూర్పుగోదావరి, శ్రీకాకుళం, విశాఖపట్నం, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని