
Updated : 27 Jan 2022 17:41 IST
AP Corona : ఏపీలో కరోనాతో 9 మంది మృతి.. కొత్తగా 13,474 కేసులు
అమరావతి : ఏపీలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 41,771 నమూనాలను పరీక్షించగా 13,474 మందికి పాజిటివ్‌గా తేలింది. రాష్ట్ర వ్యాప్తంగా 9 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా 10,290 మంది వైరస్ బారి నుంచి బయటపడినట్లు రాష్ట్ర ప్రభుత్వం బులిటెన్ విడుదల చేసింది. కడప జిల్లాలో అత్యధికంగా 2,031 కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా 1,09,493 యాక్టివ్ కేసులు ఉన్నట్లు తెలిపింది. ఇప్పటి వరకు 2,23,25,140 నమూనాలను పరీక్షించినట్లు బులిటెన్‌లో పేర్కొంది.
Tags :