ఏపీ కరోనా: వరుసగా రెండో రోజు 10వేలు+

ఆంధ్రప్రదేశ్‌లో భారీగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 10,167 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 1,441 కేసులు, కర్నూలు జిల్లాలో 1,252 కేసులు, విశాఖపట్నం జిల్లాలో 1,223 కేసులు  వచ్చాయి.

Updated : 30 Jul 2020 19:00 IST


అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో భారీగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో(9am-9am) రాష్ట్రంలో కొత్తగా 10,167 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 1,441 కేసులు, కర్నూలు జిల్లాలో 1,252 కేసులు, విశాఖపట్నం జిల్లాలో 1,223 కేసులు వచ్చాయి. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,30,557కి చేరింది. ప్రస్తుతం యాక్టివ్‌ కేసులు 69,252ఉండగా.. 60,024 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్‌ అయ్యారు. 

తాజాగా కరోనా బారిన పడి 68 మంది మరణించారు. తూర్పు గోదావరి, గుంటూరు జిల్లాల్లో తొమ్మిది మంది చొప్పున.. అనంతపురం, కర్నూలు, విశాఖపట్నం జిల్లాల్లో ఎనిమిది మంది చొప్పున.. చిత్తూరు, కడప జిల్లాల్లో ఆరుగురు చొప్పున.. ప్రకాశం, విజయనగరం జిల్లాల్లో నలుగురు చొప్పున.. కృష్ణా జిల్లాలో ముగ్గురు.. నెల్లూరు, శ్రీకాకుళం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మృత్యువాత పడ్డారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా మృతులు 1,281కి చేరారు. గత 24 గంటల్లో 70,068 శాంపిల్స్‌ను పరీక్షించినట్లు ప్రభుత్వం తెలిపింది. ఇప్పటి వరకు రాష్ట్రంలో 18,90,077 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్‌లో పేర్కొంది. ఏపీలో వరసగా రెండో రోజు పదివేలకుపైగా కరోనా కేసులు నమోదుకావడం గమనార్హం. బుధవారం 10,093 కేసులు నమోదయ్యాయి. 

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని