Andhra News: ఏబీ వెంకటేశ్వరరావుకు రాష్ట్ర ప్రభుత్వం షోకాజ్‌ నోటీసు

ఏపీ ఇంటెలిజెన్స్‌ మాజీ చీఫ్‌, ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకు రాష్ట్ర ప్రభుత్వం షోకాజ్‌ నోటీసు జారీచేసింది.

Updated : 05 Apr 2022 16:46 IST

అమరావతి: ఏపీ ఇంటెలిజెన్స్‌ మాజీ చీఫ్‌, ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకు రాష్ట్ర ప్రభుత్వం షోకాజ్‌ నోటీసు జారీచేసింది. గత నెల 21న పెగాసస్‌తో పాటు తన సస్పెన్షన్‌ అంశాలపై మీడియాతో ఆయన మాట్లాడారు. ఈ నేపథ్యంలో ఏబీ వెంకటేశ్వరరావు మీడియా సమావేశం నిర్వహించడంపై ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. మీడియాతో మాట్లాడటంపై వివరణ కోరుతూ సీఎస్‌ సమీర్‌ శర్మ ఆయనకు షోకాజ్‌ నోటీసు జారీ చేశారు. 

ఆలిండియా సర్వీస్‌ రూల్స్‌లోని 6వ నిబంధన పాటించకుండా మీడియా సమావేశం ఏర్పాటు చేశారంటూ ఏబీవీకి నోటీసు ఇచ్చారు. ప్రభుత్వం నుంచి ముందస్తు అనుమతి లేకుండా ప్రెస్‌మీట్‌ పెట్టడం తప్పేనని మెమోలో పేర్కొన్నారు. నోటీసు అందిన వారంలోపు వివరణ ఇవ్వకపోతే తదుపరి చర్యలు ఉంటాయని సీఎస్‌ అందులో పేర్కొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని