Andhra news: అంతర్రాష్ట్ర బదిలీలకు సమ్మతి తెలపండి

ప్రభుత్వ ఉద్యోగుల అంతర్రాష్ట్ర బదిలీలకు సమ్మతి తెలపాలని కోరుతూ ఏపీ ప్రభుత్వం.. తెలంగాణ

Updated : 24 Sep 2022 22:36 IST

తెలంగాణ ప్రభుత్వానికి ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి లేఖ

అమరావతి: ప్రభుత్వ ఉద్యోగుల అంతర్రాష్ట్ర బదిలీలకు సమ్మతి తెలపాలని కోరుతూ ఏపీ ప్రభుత్వం.. తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాసింది. శాశ్వత ప్రాతిపదికన అంతర్రాష్ట్ర బదిలీలకు సమ్మతి తెలపాలని లేఖలో పేర్కొంది. ఈమేరకు తెలంగాణకు చెందిన 1,808 మంది, ఏపీకి చెందిన 1,369 మంది ఉద్యోగుల బదిలీలకు మార్గం సుగమం చేయాలని కోరింది. తెలంగాణ అభ్యర్థన మేరకు ఇప్పటికే బదిలీలకు తాము సమ్మతి తెలిపినట్లు ఏపీ ప్రభుత్వం లేఖలో పేర్కొంది. ఏపీకి వెళ్లే ఉద్యోగులకు శాశ్వత బదిలీ ప్రాతిపదికన ఎన్‌వోసీ ఇవ్వాలని ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌శర్మ లేఖలో కోరారు. అనేక కారణాలతో చాలా మంది ఉద్యోగులు అసంతృప్తితో ఉన్నారని, మానవతా దృక్పథంతో సమస్యను పరిష్కరించాలని పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని