ప్రార్థన మందిరాలకు జియో ట్యాగింగ్‌: డీజీపీ

అంతర్వేది రథం దగ్ధం ఘటనతో అప్రమత్తమైన పోలీసులు ఆలయాల వద్ద భద్రతను కట్టుదిట్టం చేస్తున్నారు. రాష్ట్రంలోని దేవాలయాలు, ఇతర ప్రార్థన మందిరాలకు జియో ట్యాగింగ్ చేయాలని అన్ని జిల్లాల ఎస్పీలు,

Published : 13 Sep 2020 01:17 IST

అమరావతి: అంతర్వేది రథం దగ్ధం ఘటనతో అప్రమత్తమైన పోలీసులు ఆలయాల వద్ద భద్రతను కట్టుదిట్టం చేస్తున్నారు. రాష్ట్రంలోని దేవాలయాలు, ఇతర ప్రార్థన మందిరాలకు జియో ట్యాగింగ్ చేయాలని అన్ని జిల్లాల ఎస్పీలు, ఇతర ఉన్నతాధికారులను డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ ఆదేశించారు. ప్రార్థన మందిరాల వద్ద నిఘా కొనసాగిస్తూ, సిబ్బందిని అప్రమత్తం చేయాలని సూచించారు. ఆలయాలు, ప్రార్థన మందిరాలతోపాటు పరిసర ప్రాంతాలు స్పష్టంగా కనిపించేలా నిర్వాహకులు విద్యుత్‌ దీపాలు, సీసీ కెమెరాలను ఏర్పాటు చేయించాలని, అగ్నిప్రమాద నియంత్రణ పరికరాలు అందుబాటులో ఉండేలా చూసుకోవాలని డీజీపీ తెలిపారు.

ఆలయాల పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని డీజీపీ పేర్కొన్నారు. భద్రత చర్యలను ఎప్పటికిప్పుడు పర్యవేక్షించాలని స్పష్టం చేశారు. మతసామరస్యానికి ప్రతీకైన రాష్ట్రంలో కొందరు ఆకతాయిలు ఉద్దేశపూర్వకంగా మతాల మధ్య చిచ్చుపెడుతూ శాంతి భద్రతలకు విఘాతం కలిగించే ప్రయత్నం చేస్తున్నారని పేర్కొన్నారు. అలాంటి చర్యలను పోలీసు శాఖ ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించదని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు