
Andhra News: ఎమ్మెల్సీ డ్రైవర్ మృతి కేసు.. నివేదికలు రాగానే పూర్తి స్థాయి విచారణ: ఏపీ డీజీపీ
తిరుపతి: ఎమ్మెల్సీ అనంతబాబు మాజీ డ్రైవర్ సుబ్రహ్మణ్యం మృతిపై కేసు నమోదు చేశామని.. సాధ్యమైనంత త్వరగా కేసు విచారణ పూర్తి చేస్తామని ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి తెలిపారు. వైద్య నివేదికలు రాగానే పూర్తి స్థాయిలో విచారణ చేస్తామన్నారు. తిరుపతిలో డీజీపీ మీడియాతో మాట్లాడారు. తిరుపతి, చిత్తూరు జిల్లాల పరిధిలో రోడ్డు ప్రమాదాలు, హత్యలు, గృహహింసలపై సమీక్ష నిర్వహించారు. విజయవాడ సామూహిక అత్యాచారం కేసులో పోలీసుల స్పందన సరిగా లేదని.. నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసులపై చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. ఉమ్మడి చిత్తూరు సరిహద్దు ప్రాంతాలలో చెక్ పోస్టులను త్వరలో పునరుద్ధరణ చేస్తామని.. నిషేధిత వస్తువులను తరలిస్తే చర్యలు తీసుకుంటామన్నారు. నేరాలకు పాల్పడితే ఎలాంటివారినైనా వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు.
రాష్ట్రంలో సైబర్ క్రైం ఆదోళనకరంగా ఏమీ లేదని.. అయినప్పటికీ సైబర్ నేరాల నియంత్రణకు చర్యలు చేపడుతున్నట్లు డీజీపీ చెప్పారు. కరోనా సమయంలో రాష్ట్రంలో క్రైం రేట్ తగ్గిందన్నారు. ఆ సమయంలో నమోదైన క్రైం రేట్‌ను పోలీసు శాఖ ప్రామాణికంగా తీసుకోవడం లేదని పేర్కొన్నారు. మాజీ మంత్రి నారాయణ కేసులో ఏపీపీ సుజాత సహకరించకపోవడంతో సస్పెండ్ చేసినట్లు చెప్పారు. సోషల్ మీడియా సంస్థలు సహకరిస్తే ఫేక్ న్యూస్‌ల వ్యాప్తిని సులభంగా నియంత్రించవచ్చని డీజీపీ వెల్లడించారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
DRDO: వాయుసేన అమ్ములపొదిలో మరో ఆయుధం సిద్ధం..!
-
General News
Raghurama: కేసు నమోదు చేసిన వెంటనే రఘురామను అరెస్టు చేయొద్దు: హైకోర్టు
-
Politics News
Eknath Shindhe: మళ్లీ అలాంటివి జరగొద్దు.. ‘శిందే’సిన ఎమ్మెల్యేలపై సీఎం అసంతృప్తి
-
Technology News
Infinix Thunder Charge: ఇన్ఫినిక్స్ కొత్త ఛార్జర్.. 13 నిమిషాల్లో బ్యాటరీ ఫుల్!
-
Politics News
Devendra Fadnavis: ఫడణవీస్.. మొదటి అగ్నివీర్..!
-
Movies News
Meena: అసత్య ప్రచారం ఆపండి.. మీనా భావోద్వేగ లేఖ
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- TS TET Results: తెలంగాణ టెట్ ఫలితాలు విడుదల.. రిజల్ట్స్ కోసం క్లిక్ చేయండి..
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? ( 01-07-2022)
- Pakka Commercial Review: రివ్యూ: పక్కా కమర్షియల్
- Tollywood movies: ఏంటి బాసూ.. ఇలాంటి మూవీ తీశావ్..!
- Salmonella: ‘సాల్మొనెల్లా’ కలకలం.. ప్రపంచంలోనే అతిపెద్ద చాక్లెట్ ప్లాంట్‌లో ఉత్పత్తి నిలిపివేత!
- Uddhav thackeray: ఉద్ధవ్ లెక్క తప్పిందెక్కడ?
- Meena: అలా ఎంత ప్రయత్నించినా సాగర్‌ను కాపాడుకోలేకపోయాం: కళా మాస్టర్
- Nupur Sharma: నుపుర్ శర్మ దేశానికి క్షమాపణలు చెప్పాలి
- ఈ మార్పులు.. నేటి నుంచి అమల్లోకి..
- Andhra News: రూ.వందల కోట్ల ఆర్థిక మాయ!