Pawan Kalyan: చిన్నారులకు శాస్త్రసాంకేతిక రంగాల్లో ఆసక్తి పెంచుదాం..: ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌

తనకు కేటాయించిన శాఖలపై వరుస సమీక్షల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ గురువారం రాష్ట్ర శాస్త్రసాంకేతిక శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు.

Updated : 20 Jun 2024 21:50 IST

అమరావతి: గ్రామీణ ప్రాంతాల్లోని చిన్నారులకు సైన్స్ పట్ల ఆసక్తి పెంపొందించే దిశగా రాష్ట్ర శాస్త్రసాంకేతిక శాఖ అధికారులు కృషి చేయాలని ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ ఆదేశించారు. తనకు కేటాయించిన శాఖలపై వరుస సమీక్షల్లో భాగంగా సంబంధిత శాఖ అధికారులతో సమావేశమయ్యారు. కేంద్ర ప్రభుత్వ ‘విజన్ 2047’కు అనుగుణంగా ఆవిష్కరణల దిశగా విద్యార్థులను తీర్చేదిద్దే ప్రయత్నం వేగంగా సాగాలని సూచించారు. వారు శాస్త్రవేత్తలుగా మారేందుకు అవసరమైన ప్రోత్సాహం అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.

ఏపీలో స్టూడియోల నిర్మాణానికి ముందుకు రావాలి: మంత్రి కందుల దుర్గేష్‌

‘‘పిల్లలకు శాస్త్రసాంకేతిక అంశాల్లో ఆసక్తి కల్పించడంపై ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్లాలి. గ్రామీణ ప్రాంతాల్లోని చిన్నారులకు సైన్స్ అండ్ టెక్నాలజీ అంశాల్లో ప్రతిభ ఉంటుంది. దానిని వెలికితీసేలా పెద్దఎత్తున వైజ్ఞానిక ప్రదర్శనలు నిర్వహించేందుకు సన్నద్ధం కావాలి’’ అని ఆదేశించారు. వైజ్ఞానిక ప్రదర్శనలతో రాబోయే తరాల్లో సైన్స్ పట్ల మక్కువ పెరుగుతుందని చెప్పారు. రాజమండ్రి ఉప ప్రాంతీయ వైజ్ఞానిక కేంద్రం (ఎస్ఆర్ఎస్సీ) ప్రారంభానికి సిద్ధంగా ఉన్న విషయాన్ని అధికారులు ఆయన దృష్టికి తీసుకెళ్లగా.. త్వరలోనే అందుబాటులోకి తీసుకురావాలన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని