AP News: పాఠశాలలకు సెలవులు ఇచ్చే ఆలోచన లేదు: మంత్రిసురేశ్‌

నాణ్యమైన విద్య అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌ అన్నారు. ఉన్నత విద్యలో కొత్త కోర్సులు

Updated : 20 Jan 2022 17:39 IST

గుంటూరు: నాణ్యమైన విద్య అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌ అన్నారు. ఉన్నత విద్యలో కొత్త కోర్సులు అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు చెప్పారు. భవిష్యత్తు కోసం ఆన్‌లైన్‌ విధానం తప్పనిసరి అని ఆయన తెలిపారు. ఆన్‌లైన్‌ కోర్సులకు రానున్న కాలంలో మరింత డిమాండ్‌ ఉంటుందని వివరించారు. గుంటూరు వడ్లమూడిలోని విజ్ఞాన్‌ యూనివర్సిటీలో ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌తో కలిసి మంత్రి సురేశ్‌ ఇవాళ ఆన్‌లైన్ విద్యాభ్యాసం ప్రారంభించారు

ఈ సందర్భంగా పీఆర్సీకి వ్యతిరేకంగా ఉద్యోగుల నిరసనలు, కొవిడ్‌ నేపథ్యంలో పాఠశాలల నిర్వహణపై మంత్రి స్పందించారు. ‘‘సీఎంతో సమావేశంలో ఉద్యోగులు పీఆర్సీకి అంగీకరించారు. మళ్లీ ఇప్పుడు ఆందోళన చేయడం సరికాదు. ఏదైనా ఇబ్బంది ఉంటే ప్రభుత్వంతో మాట్లాడవచ్చు.

కొవిడ్‌ కేసులు పెరుగుతున్నా తీవ్రత లేదు. పాఠశాలలకు సెలవులు ఇచ్చే ఆలోచన లేదు. పిల్లలకు కొవిడ్‌ సోకితే ఆ పాఠశాల మూసివేసి తర్వాత ప్రారంభిస్తాం. కొన్ని యూనివర్సీటీలు పరీక్షలు కూడా నిర్వహిస్తున్నాయి. కోర్టు కూడా పరీక్షలకు అనుమతి ఇచ్చింది’’ అని మంత్రి సురేశ్‌ అన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని