షెడ్యూల్‌ ప్రకారమే టెన్త్‌, ఇంటర్‌ పరీక్షలు

రాష్ట్రంలో ముందస్తు షెడ్యూల్‌ ప్రకారమే టెన్త్‌, ఇంటర్‌ పరీక్షలు జరుగుతాయని ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌ స్పష్టం చేశారు. సీబీఎస్ఈ పదో తరగతి పరీక్షలు

Published : 15 Apr 2021 01:17 IST

అమరావతి: రాష్ట్రంలో ముందస్తు షెడ్యూల్‌ ప్రకారమే టెన్త్‌, ఇంటర్‌ పరీక్షలు జరుగుతాయని ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌ స్పష్టం చేశారు. సీబీఎస్ఈ పదో తరగతి పరీక్షలు రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నప్పటికీ.. ఏపీలో యథావిధిగానే పరీక్షలు ఉంటాయని తెలిపారు. కొవిడ్‌ పరిస్థితిపై సీఎం జగన్‌తో సమీక్షించిన అనంతరం తదుపరి నిర్ణయం వెల్లడిస్తామని మంత్రి తెలిపారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. 

అన్ని పాఠశాలల్లో కొవిడ్ వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని మంత్రి తెలిపారు. విద్యార్థులకు కరోనా పరీక్షలు నిర్వహిస్తూ ప్రతిరోజూ పరిస్థితిని సమీక్షిస్తున్నామన్నారు. సమీప భవిష్యత్తులో కొవిడ్ కేసులు పెరిగితే అప్పుడు పరీక్షల నిర్వహణపై ఆలోచిస్తామని చెప్పారు. కొవిడ్‌ నిబంధనలు పాటించని విద్యా సంస్థలపై చర్యలు తీసుకుంటామన్నారు. ఇప్పటికైతే యథావిధిగా షెడ్యూల్ ప్రకారమే అన్ని పరీక్షలు జరిపే ఆలోచనలో ఉన్నామని మంత్రి వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని