
Published : 27 Jan 2022 14:43 IST
AP PRC: బిల్లులు అప్లోడ్ చేయండి.. లేదంటే చర్యలు తప్పవ్!
మరోసారి సర్క్యులర్ జారీ చేసిన ఏపీ ఆర్థిక శాఖ
అమరావతి: కొత్త పీఆర్సీ జీవోలను వెనక్కి తీసుకోవాలని ఉద్యోగులు ఉద్యమిస్తున్నా.. ఏపీ ప్రభుత్వం ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. తాజాగా ఉద్యోగుల జీతాలు, పింఛన్ల బిల్లులను ప్రాసెస్ చేయాలని ఆర్థికశాఖ మరోసారి సర్క్యులర్ జారీ చేసింది. కొత్త పీఆర్సీకి అనుగుణంగానే జీతాలు, పింఛన్ల బిల్లులు ఉండాలని సూచించింది. ఈ మేరకు సాయంత్రంలోగా బిల్లులు అప్లోడ్ చేయాలని డీడీవోలకు గడువు విధించింది. గడువులోగా బిల్లుల ప్రక్రియ చేపట్టకుంటే సంబంధిత అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించింది. ఈ మేరకు రేపటిలోగా బిల్లులు ప్రాసెస్ చేసి, ఫిబ్రవరి 1 నాటికి జీతాలు వచ్చేలా చూడాలని ఆదేశించింది.
Tags :