Andhra news: రుషికొండ తవ్వకాలపై ఎన్జీటీ స్టే.. సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఏపీ ప్రభుత్వం

విశాఖలోని రుషికొండ తవ్వకాలపై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. విశాఖ వద్ద రుషికొండ తవ్వకాలపై ఇటీవల జాతీయ హరిత ట్రైబ్యునల్‌ (ఎన్జీటీ) ప్రిన్సిపల్‌

Published : 23 May 2022 16:24 IST

అమరావతి: విశాఖలోని రుషికొండ తవ్వకాలపై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. విశాఖ వద్ద రుషికొండ తవ్వకాలపై ఇటీవల జాతీయ హరిత ట్రైబ్యునల్‌ (ఎన్జీటీ) ప్రిన్సిపల్‌ ధర్మాసనం స్టే విధిస్తూ జారీ చేసిన ఆదేశాలను సుప్రీంకోర్టులో సవాల్‌ చేసింది. పర్యావరణ అనుమతులు అన్నీ పొందాకే తవ్వకాలు మొదలుపెట్టినట్లు పేర్కొంది. పర్యావరణానికి ఎలాంటి హాని తలపెట్టకుండా తవ్వకాలు చేపడతామని ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది.వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్‌పై ఈ నెల 6న తేదీన ఎన్జీటీ బెంచ్‌ విచారణ చేసింది. విచారణ చేపట్టిన ఎన్జీటీ.. తవ్వకాలపై అధ్యయనానికి సంయుక్త కమిటీని నియమించింది. నెల రోజుల్లో నివేదిక సమర్పించాలని కమిటీని ఆదేశించింది. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు తవ్వకాలు నిలిపివేయాలని ప్రభుత్వాన్ని ఎన్జీటీ ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఎన్జీటీ ఆదేశాలను సవాల్ చేస్తూ ఏపీ సర్కార్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని