Andhra News: మరో రూ.వెయ్యి కోట్ల అప్పు చేసిన ఏపీ ప్రభుత్వం

రిజర్వు బ్యాంకులో సెక్యూరిటీల వేలం ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో రూ.వెయ్యి కోట్ల రుణం తీసుకుంది...

Published : 28 Sep 2022 01:26 IST

అమరావతి: రిజర్వు బ్యాంకులో సెక్యూరిటీల వేలం ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో రూ.వెయ్యి కోట్ల రుణం తీసుకుంది. రూ.500 కోట్ల చొప్పున రెండు లాట్లుగా సెక్యూరిటీ బాండ్లను వేలం వేశారు. 6 ఏళ్ల కాలపరిమితితో వేలం వేసిన సెక్యూరిటీ బాండ్లకు 7.6శాతం మేర ప్రభుత్వం వడ్డీ చెల్లించనుంది. 2028 నాటికి సెక్యూరిటీ బాండ్లు పూర్తిగా చెల్లించేలా కాలపరిమితి నిర్దేశించారు. 12 ఏళ్ల కాలపరిమితితో వేలం వేసిన సెక్యూరిటీ బాండ్లకు 7.71శాతం మేర ప్రభుత్వం వడ్డీ చెల్లించనుంది. 2022 ఏప్రిల్‌ 1 నుంచి ఇప్పటి వరకు సెక్యూరిటీ బాండ్ల వేలం ద్వారా రూ.45,890 కోట్ల రుణాన్ని ప్రభుత్వం తీసుకుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని