Andhra News: ఎస్మా ఉత్తర్వులు జారీ చేసిన గనుల శాఖ.. వెంటనే ఉపసంహరణ

ఓ వైపు ఉద్యోగల సంఘాల నేతలతో మంత్రుల కమిటీ చర్చలు కొనసాగుతుండగా మరోవైపు గనులశాఖ ఎస్మా ఉత్తర్వులు జారీ చేసింది. ఉద్యోగులు సమ్మెకు వెళ్తే ఎస్మా చట్టం ప్రయోగిస్తామని గనులశాఖ

Updated : 05 Feb 2022 20:10 IST

అమరావతి: ఓ వైపు ఉద్యోగ సంఘాల నేతలతో మంత్రుల కమిటీ చర్చలు కొనసాగుతుండగా మరోవైపు గనులశాఖ ఎస్మా ఉత్తర్వులు జారీ చేసింది. ఉద్యోగులు సమ్మెకు వెళ్తే ఎస్మా చట్టం ప్రయోగిస్తామని గనులశాఖ డైరెక్టర్‌ వెంకట్‌రెడ్డి ఉత్తర్వులు జారీ చేయడంపై  ఆశాఖ ఉద్యోగులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. చర్చల సమయంలో ఎస్మా ఉత్తర్వులు సరికాదని ఉద్యోగ సంఘాల నేతలు పేర్కొన్నారు. గనులశాఖలో అత్యవసర సేవలు ఏమి ఉంటాయని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. చర్చల సమయంలో ఇలాంటి ఉత్తర్వులు సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో కాసేపటికే ఎస్మా ఉత్తర్వులను గనులశాఖ ఉపసంహరించింది. అవసరమైతే ప్రభుత్వమే ఎస్మా ఉత్తర్వులను జారీ చేస్తుందని గనులశాఖ పేర్కొంది.

ఇదిలా ఉండగా.. ఉద్యోగ సంఘాల నేతలు, మంత్రుల కమిటీ ఇవాళ మధ్యాహ్నం మరో మారు సమావేశమైంది. హెచ్‌ఆర్‌ఏ స్లాబ్‌లు, ఐఆర్‌ రికవరీ, ఇతర అంశాలపై చర్చించనున్నారు. సమావేశం పూర్తయ్యాక మంత్రుల కమిటీ సీఎంను కలవనుంది. ఉద్యోగ సంఘాల నేతలను సీఎం వద్దకు తీసుకెళ్లనుంది. ఉద్యోగుల డిమాండ్లపై నిర్ణయాలను సీఎం సమక్షంలోనే ప్రకటించే అవకాశం ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని