Bharat Biotech, Serumకు ఏపీ సర్కార్‌ లేఖ

ప్రముఖ వ్యాక్సిన్‌ తయారీ సంస్థలు భారత్‌ బయోటెక్‌, సీరం సంస్థలకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం లేఖ రాసింది. రెండు సంస్థలు చెరో 4.08 కోట్ల డోసుల వ్యాక్సిన్లను సరఫరా

Published : 25 Apr 2021 01:56 IST

అమరావతి: ప్రముఖ వ్యాక్సిన్‌ తయారీ సంస్థలు భారత్‌ బయోటెక్‌, సీరం సంస్థలకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం లేఖ రాసింది. రెండు సంస్థలు చెరో 4.08 కోట్ల డోసుల వ్యాక్సిన్లను సరఫరా చేయాలని కోరింది. సరిపడా డోసులను రాష్ట్రానికి విక్రయించాలని భారత్‌ బయోటెక్‌, సీరం సంస్థలను లేఖలో కోరింది. రాష్ట్రవ్యాప్తంగా 2.4 కోట్ల మందికి రెండేసి డోసులు చొప్పున ఇవ్వాలని తెలిపింది. అయితే కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన ధరకే వ్యాక్సిన్‌ సరఫరా చేయాలని కోరింది. వ్యాక్సిన్ల బిల్లు త్వరగానే చెల్లిస్తామని వివరించింది. 

భారత్‌ బయోటెక్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ కృష్ణా ఎల్లా, హెటెరో డ్రగ్స్‌ ఎండీ పార్థసారథికి సీఎం జగన్‌ నిన్న ఫోన్ చేసి మాట్లాడిన విషయం తెలిసిందే. రాష్ట్ర అవసరాల కోసం మరిన్ని వ్యాక్సిన్‌ డోసులు సరఫరా చేయాలని వారిని కోరారు. రెమ్‌డెసివిర్‌ ఇంజెక్షన్లు కూడా సరఫరా చేయాలని సీఎం వారికి విజ్ఞప్తి చేశారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని