Ap Govt-GPS: మరోసారి జీపీఎస్‌ బిల్లులో మార్పులు చేసిన ఏపీ ప్రభుత్వం

గ్యారంటీడ్‌ పెన్షన్‌ స్కీమ్‌ (జీపీఎస్‌) బిల్లులో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మరోసారి మార్పులు చేసింది. అత్యవసరంగా ఇ-ఫైల్‌ ద్వారా మంత్రులకు సర్క్యులేట్‌ చేసింది.

Updated : 26 Sep 2023 15:23 IST

అమరావతి: గ్యారంటీడ్‌ పెన్షన్‌ స్కీమ్‌ (జీపీఎస్‌) బిల్లులో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మరోసారి మార్పులు చేసింది. బిల్లులో లోపాలను సవరిస్తూ మరోమారు కేబినెట్‌ ఆమోదానికి పంపించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం అత్యవసరంగా ఇ-ఫైల్‌ ద్వారా బిల్లును మంత్రులకు సర్క్యులేట్‌ చేసింది. జీపీఎస్‌లో ప్రతిపాదించిన పెన్షన్‌ టాప్‌ అప్‌పై నెలకొన్న సందిగ్ధతను తొలగిస్తూ ప్రతిపాదనలు చేసింది. ఫ్యామిలీ పెన్షన్‌, మినిమమ్‌ పెన్షన్‌ ఎలా ఇవ్వాలన్న దానిపై బిల్లులో మార్పులు చేర్పులు చేసింది. జీపీఎస్‌ బిల్లులో తీసుకొచ్చిన కొత్త ప్రతిపాదనలు ఆమోదించి పంపాలని మంత్రులకు ప్రభుత్వం సూచించింది. కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీమ్‌ (సీపీఎస్‌) ఉద్యోగులు జీపీఎస్‌లోనే కొనసాగేలా నిర్దేశిత గడువు ఇవ్వాలని ప్రభుత్వం సూచించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని