TTD: ప్రత్యేక అథారిటీ ఏర్పాటు

తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) పాలకమండలి గడువు ముగిసింది. ఈ నేపథ్యంలో ప్రత్యేక అథారిటీని ఏర్పాటు చేస్తూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నోటిఫికేషన్  విడుదల చేసింది. ఈ ప్రత్యేక అథారిటీ ఛైర్మన్‌గా తితిదే ఈవో జవహర్‌ రెడ్డి, కన్వీనర్‌గా అదనపు ఈవోను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం..

Published : 23 Jun 2021 21:56 IST

తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) పాలకమండలి గడువు ముగిసింది. ఈ నేపథ్యంలో ప్రత్యేక అథారిటీని ఏర్పాటు చేస్తూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నోటిఫికేషన్  విడుదల చేసింది. ఈ ప్రత్యేక అథారిటీ ఛైర్మన్‌గా తితిదే ఈవో జవహర్‌ రెడ్డి, కన్వీనర్‌గా అదనపు ఈవోను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ప్రత్యేక అథారిటీ తక్షణమే అమల్లోకి వస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొంది. పాలకమండలి అధికారాలన్నీ అథారిటీకి ఉంటాయని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. పాలక మండలి గడువు ఈనెల 21తో ముగియడంతో ఈ ప్రత్యేక అథారిటీని ఏర్పాటు చేస్తూ నోటిఫికేషన్ ఇచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని