ap endowment: డిప్యూటీ కమిషనర్‌పై ఇసుక.. ప్రభుత్వం ఆగ్రహం
విశాఖ జిల్లా దేవాదాయశాఖ కార్యాలయంలో ఇద్దరు అధికారుల మధ్య జరిగిన వివాదాన్ని ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది
విశాఖపట్నం: విశాఖ జిల్లా దేవాదాయశాఖ కార్యాలయంలో ఇద్దరు అధికారుల మధ్య జరిగిన వివాదాన్ని ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. విశాఖలో దేవాదాయశాఖ అధికారులు పరస్పర దూషణల వ్యవహారంలో ప్రభుత్వ ఆగ్రహం వ్యక్తం చేసింది. కార్యాలయంలోనే అధికారులు వాగ్వాదానికి దిగడాన్ని తీవ్రంగా పరిగణిస్తామని దేవదాయశాఖ ముఖ్య కార్యదర్శి వాణిమోహన్ స్పష్టం చేశారు. ఈ ఘటనపై రాజమండ్రి ఆర్జేసీ సురేశ్‌బాబుని విచారణాధికారిగా నియమిస్తున్నట్లు తెలిపారు. వీలైనంత త్వరలో నివేదిక ఇవ్వాలని ఆర్జేసీని ఆదేశించారు. దాని ఆధారంగా ఉద్యోగులపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఈ తరహా ఘటనల విషయంలో అవసరమైతే ఉద్యోగుల టెర్మినేట్ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.
అసలేం జరిగిందంటే!
విశాఖ జిల్లా దేవాదాయ శాఖ కార్యాలయంలో డిప్యూటీ కమిషనర్ పుష్పవర్ధన్‌పై అసిస్టెంట్ కమిషనర్ శాంతి ఇసుక పోశారు. పుష్పవర్ధన్ నెలరోజుల క్రితం తెలంగాణ నుంచి ఏపీకి బదిలీపై వచ్చారు. జిల్లాలో దేవాదాయశాఖ పరిధిలో అన్యాక్రాంతమైన భూములను తిరిగి స్వాధీనం చేసుకునే ప్రక్రియ చేపట్టారు. ఆ భూముల వ్యవహారంలో కిందిస్థాయి సిబ్బందిపై పలుమార్లు ఆయన ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. అధికారుల ఉదాసీనతను పుష్పవర్ధన్ ప్రశ్నించడంతోనే ఈ ఘటన చోటుచేసుకున్నట్లు సమాచారం. అసిస్టెంట్ కమిషనర్ శాంతి చర్యలతో నిర్ఘాంతపోయిన పుష్పవర్ధన్.. ఘటనపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. కార్యాలయానికి విజిలెన్స్ సిబ్బంది చేరుకుని మొత్తం వ్యవహారంపై విచారణ చేపట్టారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
Rishi Sunak: సునాక్ మీరు బిలియనీరా..? బ్రిటన్ ప్రధాని సమాధానమిదే..
-
Sports News
IND vs AUS: బోర్డర్ - గావస్కర్ ట్రోఫీ.. అగ్గి రాజేశారు.. వారికి ఇది అలవాటే: అశ్విన్
-
India News
IndiGo: పట్నా వెళ్లాల్సిన ప్రయాణికుడు ఉదయ్‌పుర్‌కు.. ‘ఇండిగో’లో ఘటన!
-
Sports News
Asia Cup 2023: ఆసియా కప్ 2023.. నిర్వహణ ఎక్కడో రేపే తేలనుందా..?
-
World News
USA: భారత వ్యతిరేకి ఇల్హాన్ ఒమర్‌కు షాక్..!
-
India News
Akhilesh Yadav: అఖిలేశ్ యాదవ్‌కు తప్పిన ప్రమాదం