Andhra Pradesh News: ఏపీ సీఐడీ చీఫ్ సంజయ్‌ బదిలీ.. ప్రభుత్వం ఉత్తర్వులు

ఆంధ్రప్రదేశ్‌లో వివాదాస్పద నిర్ణయాలు తీసుకున్న పలువురు అధికారులపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది.

Published : 07 Jun 2024 23:38 IST

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో వివాదాస్పద నిర్ణయాలు తీసుకున్న పలువురు అధికారులపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. వారిపై బదిలీ వేటు వేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఏపీ సీఐడీ చీఫ్‌ ఎన్‌.సంజయ్‌, విజిలెన్స్‌ ఐజీ, ఎక్స్‌ అఫిషియో కార్యదర్శి కొల్లి రఘురామిరెడ్డిలను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు వారిద్దరూ డీజీపీ కార్యాలయంలో రిపోర్టు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు ఫైబర్‌నెట్‌ ఎండీ మధుసూదన్‌ రెడ్డి, ఏపీఎండీసీ ఎండీ వెంకటరెడ్డిలను సైతం రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. తక్షణం సాధారణ పరిపాలన శాఖలో రిపోర్టు చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఆయా బాధ్యతలను పరిశ్రమల శాఖ కార్యదర్శి యువరాజ్‌కు అప్పగిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని