వాలంటీర్లకు దినపత్రిక కొనుగోలుకు ఇచ్చే అలవెన్సు రద్దు

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వం తమ సొంత పత్రిక సర్క్యులేషన్‌ పెంచుకోవడమే లక్ష్యంగా వాలంటీర్లకు దినపత్రిక కొనుగోలు కోసం ఇచ్చిన అలవెన్సును రద్దు చేసింది.

Updated : 24 Jun 2024 19:21 IST

అమరావతి: రాష్ట్రంలో గ్రామ, వార్డు వాలంటీర్లకు దినపత్రిక కొనుగోలు కోసం గతంలో ఇచ్చే అలవెన్సును ఏపీ ప్రభుత్వం రద్దు చేసింది. న్యూస్‌ పేపర్‌ అలవెన్సు కోసం ఎలాంటి చెల్లింపులు జరపవద్దని ఆదేశాలు జారీ చేసింది. గత ప్రభుత్వం అడ్డదారుల్లో తమ సొంత పత్రిక సర్క్యులేషన్‌ పెంచుకొనేలా.. వాలంటీర్లు పత్రిక వేయించుకోవాలంటూ రూ.200 చొప్పున చెల్లిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. సొంత పత్రికకు ప్రభుత్వ నిధులు దోచిపెట్టేందుకు జగన్‌ ఆ జీవోలు ఇచ్చారంటూ అప్పట్లో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో పత్రిక కొనుగోలు ఉత్తర్వులను రద్దు చేస్తూ కొత్త ప్రభుత్వం మెమో జారీ చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని