APPSC: పోటీ పరీక్షల్లో ఇంటర్వ్యూలు ఉండవ్‌..

 ఏపీపీఎస్సీ పోటీపరీక్షల్లో ఇంటర్వ్యూలు ఎత్తి వేస్తూ ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గ్రూప్‌ 1 సహా అన్ని కేటగిరీ పోస్టులకు ఇంటర్వూలు రద్దు చేసినట్లు వెల్లడించింది. ఈమేరకు  సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి...

Updated : 26 Jun 2021 13:43 IST

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

అమరావతి:  ఏపీపీఎస్సీ పోటీపరీక్షల్లో ఇంటర్వ్యూలు ఎత్తి వేస్తూ ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గ్రూప్‌ 1 సహా అన్ని కేటగిరీ పోస్టులకు ఇంటర్వూలు రద్దు చేసినట్లు వెల్లడించింది. ఈమేరకు  సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌కుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఉద్యోగాల ఎంపికలో ఇకనుంచి ఇంటర్వ్యూలు ఉండబోవని చెప్పారు. పోటీ పరీక్షల్లో పారదర్శకత కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఉత్తర్వులు వెలువడిన తేదీ నుంచి ఆదేశాలు వర్తిస్తాయని  వెల్లడించింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని