Vizianagaram: మళ్లీ పేరు మార్పు.. ఈసారి విజయనగరం మహారాజా ఆస్పత్రి వంతు!

ఏపీలో ప్రభుత్వ కార్యాలయాలు, భవనాల పేర్ల మార్పు కొనసాగుతోంది. విజయవాడలోని ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ పేరును మార్చిన ప్రభుత్వం.. తాజాగా విజయనగరంలో ఎంతో ఘన చరిత్ర కలిగిన మహారాజా ఆస్పత్రి పేరును కూడా మార్చేసింది.

Updated : 07 Oct 2022 12:51 IST

విజయనగరం: ఏపీలో ప్రభుత్వ కార్యాలయాలు, భవనాల పేర్ల మార్పు కొనసాగుతోంది. ఇటీవల విజయవాడలోని ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ పేరును మార్చిన ప్రభుత్వం.. తాజాగా విజయనగరంలో ఎంతో ఘన చరిత్ర కలిగిన మహారాజా ఆస్పత్రి పేరును కూడా మార్చేసింది. మహారాజా జిల్లా కేంద్ర ఆస్పత్రి పేరును ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిగా మార్చింది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై విజయనగరం జిల్లా వ్యాప్తంగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని జిల్లా వాసులు కోరుతున్నారు.

గురువారం రాత్రి మహరాజా కేంద్ర ఆసుపత్రి పేరుకు బదులు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిగా బోర్డు దర్శనమిచ్చింది. ఉదయం ఆస్పత్రికి వెళ్లిన రోగులు, ప్రజలు దీనిపై ఆందోళన వ్యక్తం చేశారు. రాత్రికి రాత్రే బోర్డు మార్చేస్తూ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం హేయమైనదిగా అభివర్ణించారు. ఈ విషయం తెలుసుకుని తెదేపా నేతలు, కార్యకర్తలు ఆస్పత్రి వద్దకు చేరుకుని ఆందోళనకు దిగారు. ప్రజలకు ఎంతో సేవ చేసిన మహారాజా రాజవంశాన్ని అవమానించేలా వైకాపా ప్రభుత్వం చర్యలు ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని