Updated : 05 Feb 2022 06:34 IST

Andhrapradesh News: అర్ధరాత్రి వరకు చర్చలు.. ఏకాభిప్రాయం కుదిరాకే తుది నిర్ణయమన్న ఉద్యోగ సంఘాలు

అమరావతి: న్యాయమైన పీఆర్సీ తదితర అంశాలపై ఉద్యమిస్తున్న ఏపీ ఉద్యోగ సంఘాల పోరాటంలో కొంత పురోగతి కనిపిస్తోంది. ఇందులో భాగంగా శుక్రవారం సాయంత్రం ఉద్యోగ సంఘాలతో మంత్రుల కమిటీ చర్చలు సుదీర్ఘంగా నిర్వహించింది. అర్ధరాత్రి వరకు జరిగిన ఈ చర్చల్లో కొన్నిటికి పరిష్కారం లభించడంతో పాటు మరొకొన్ని కీలక విషయాలపై చర్చించాల్సి ఉంది. దీంతో మరోమారు ఉద్యోగ సంఘాలతో మంత్రుల కమిటీ ఈ రోజు భేటీ కానుంది.  అనంతరం స్టీరింగ్‌ కమిటీ సీఎం జగన్‌ను సైతం కలిసే అవకాశం ఉంది. మొదట ఉదయం 10 గంటలకు మంత్రుల కమిటీ సమావేశం కానుంది. అనంతరం 2 గంటలకు ఉద్యోగ సంఘాలతో మంత్రుల కమిటీ భేటీ కానుంది. ఆపై ఉద్యోగ సంఘాలు సీఎం జగన్‌ను కలవనున్నట్లు సమాచారం.   

చర్చలు ఆశాజనకంగా సాగాయి: సజ్జల

స్టీరింగ్‌ కమిటీతో భేటీ ముగిసిన అనంతరం ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడారు. చర్చలు సుదీర్ఘంగా సాగినట్లు తెలిపారు. ఉద్యోగ సంఘాల నాయకులు పాటిజివ్‌గా మాట్లాడినట్లు తెలిపారు. శనివారం మళ్లీ కలుద్దామని నిర్ణయించినట్లు సజ్జల తెలిపారు. చర్చలు ఆశాజనకంగా జరిగాయని, సమ్మె విరమించాలని ఉద్యోగ సంఘాలను కోరినట్లు మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. సహాయ నిరాకరణకు వెళ్లకుండా చూడాలని ఉద్యోగ సంఘాలను మంత్రుల కమిటీ కోరింది. అయితే ఈ చర్చల్లో పీఆర్సీ నివేదికపై ఇంకా స్పష్టత రాలేదు. ఐఆర్‌ను వేతనాల నుంచి రివకరీ చేయబోమని మంత్రుల కమిటీ ఉద్యోగ సంఘాలకు హామీ ఇచ్చింది. సిటీ కంపన్సేటరీ అలవెన్సు పునరుద్ధరణ అంశాన్ని పరిశీలిస్తామని మంత్రుల కమిటీ పేర్కొంది.

అన్ని అంశాలపై ఏకాభిప్రాయం కుదిరాకే తదుపరి నిర్ణయం

మంత్రుల కమిటీ భేటీ అనంతరం ఉద్యోగ సంఘాల నాయకులు మీడియాతో మాట్లాడారు. ఉద్యోగుల ఆకాంక్షను చర్చల్లో వినిపించినట్లు స్టీరింగ్‌ కమిటీ తెలిపింది. తమ డిమాండ్లపై ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించినట్లు తెలిపింది. అయితే సహాయ నిరాకరణ యథావిధిగా కొనసాగుతుందని ఉద్యోగ సంఘాలు తెలిపాయి. పూర్తిస్థాయిలో ఇంకా చర్చలు జరపాల్సి ఉందని స్టీరింగ్‌ కమిటీ పేర్కొంది. ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం సానుకూల ధోరణితో ఉన్నట్లు స్టీరింగ్‌ కమిటీ తెలిపింది. ఈ రోజు మధ్యాహ్నం చర్చల అనంతరం కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు. కొన్ని అంశాల్లో ప్రభుత్వంతో ఏకాభిప్రాయం కుదిరిందని స్టీరింగ్‌ కమిటీ పేర్కింది.  అన్ని అంశాలపై ఏకాభిప్రాయం కుదిరాకే తదుపరి నిర్ణయం తీసుకుంటామన్నారు. 

 

Read latest General News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని