Andhra News: 175 మంది ఖైదీలకు క్షమాభిక్ష

రాష్ట్రంలోని వివిధ జైళ్లలో జీవిత ఖైదు అనుభవిస్తున్న పలువురికి ఏపీ ప్రభుత్వం శుభవార్త అందించింది. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా 175 మంది ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదించింది.

Published : 15 Aug 2022 00:32 IST

అమరావతి: రాష్ట్రంలోని వివిధ జైళ్లలో జీవిత ఖైదు అనుభవిస్తున్న పలువురికి ఏపీ ప్రభుత్వం శుభవార్త అందించింది. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా 175 మంది ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదించింది. ఈ నేపథ్యంలో ఖైదీలను విడుదల చేయాలని హోంశాఖ కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. విడుదల కానున్న ఖైదీలు రూ.50 వేల వ్యక్తిగత పూచికత్తు జమ చేయాలని ప్రభుత్వం సూచించింది. శిక్షాకాలం ముగిసే వరకూ 3 నెలలకోసారి సంబంధిత పోలీస్‌స్టేషన్‌లో హాజరుకావాలని ఆదేశించింది. నేరపూరిత చర్యలకు పాల్పడితే తక్షణమే రీ అరెస్ట్‌ అవుతారని ప్రభుత్వం హెచ్చరించింది. సత్ప్రవర్తన కలిగిన మరో 20 మంది ఖైదీల విడుదలకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 
 

Read latest General News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని