Andhra News: సీఎస్ సమీర్‌శర్మ కోసం కొత్త పోస్టు సృష్టించిన ఏపీ ప్రభుత్వం
ఏపీ సీఎస్‌గా (ఈనెల 30న) బుధవారం పదవీ విరమణ చేయనున్న సమీర్‌శర్మ కోసం రాష్ట్ర ప్రభుత్వం కొత్త పోస్టు సృష్టించింది. ఆయన కోసం సీఎం కార్యాలయంలో కొత్త పోస్టును సృష్టించారు.
అమరావతి: ఏపీ సీఎస్‌గా (ఈనెల 30న) బుధవారం పదవీ విరమణ చేయనున్న సమీర్‌శర్మ కోసం రాష్ట్ర ప్రభుత్వం కొత్త పోస్టు సృష్టించింది. పదవీవిరమణ అనంతరం ఆయన్ను రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ఛైర్మన్‌గా నియమించనున్నట్టు ప్రచారం జరిగింది. కానీ, ప్రభుత్వ ఎక్స్ అఫీషియో చీఫ్ సెక్రటరీగా సమీర్ శర్మను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన కోసం సీఎం కార్యాలయంలో కొత్త పోస్టును సృష్టించారు. ప్రణాళికా విభాగం ఎక్స్ ఆఫీషియో కార్యదర్శిగా ఉన్న విజయ్‌కుమార్ బుధవారం పదవీవిరమణ చేయనున్నారు. ఆయన కోసం కూడా కొత్త పోస్టు ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. విజయ్‌కుమార్‌ను స్టేట్ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ సీఈవోగా నియమించారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Beating Retreat: సైనిక విన్యాసాలు భళా.. 3,500 డ్రోన్లతో మెగా షో.. వీక్షించండి
-
Sports News
Djokovic: ఆస్ట్రేలియన్ ఓపెన్ 2023.. జకోవిచ్ ఖాతాలో పదో టైటిల్.. మొత్తంగా 22వ గ్రాండ్‌స్లామ్
-
General News
Harish Rao: వైద్యరంగంలో మనం దేశానికే ఆదర్శం: హరీశ్‌రావు
-
General News
Srisailam: శ్రీశైలం ఘాట్రోడ్లో రక్షణ గోడను ఢీకొన్న ఆర్టీసీ బస్సు.. తప్పిన పెను ప్రమాదం
-
General News
Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Movies News
Chiranjeevi: జన్మజన్మలకు నీకే బిడ్డలుగా పుట్టాలని కోరుకుంటున్నాం..: చిరంజీవి