Andhra news: న్యూ ఇయర్‌.. అర్ధరాత్రి వరకు మద్యం విక్రయాలకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి

ఏపీలో నూతన సంవత్సర వేడుకల సందర్భంగా మద్యం విక్రయ సమయాన్ని రాష్ట్ర ప్రభుత్వం పొడిగించింది. వైన్స్‌ల్లో అర్ధరాత్రి 12 గంటల వరకు, రెస్టారెంట్లు, బార్లలో రాత్రి ఒంటిగంట వరకు అనుమతి ఇచ్చింది.

Updated : 31 Dec 2022 15:54 IST

అమరావతి: న్యూ ఇయర్‌ వేడుకల దృష్ట్యా వైన్స్‌, బార్లలో మద్యం విక్రయ సమయాన్ని పొడిగిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ బెవరేజెస్‌ కార్పొరేషన్‌ నిర్వహించే మద్యం దుకాణాల్లో విక్రయాల సమయాన్ని అర్ధరాత్రి 12 గంటల వరకు, రెస్టారంట్లు, హోటళ్లు, ఈవెంట్లు, బార్లలో రాత్రి ఒంటిగంట వరకు అనుమతి ఇచ్చింది. డిసెంబరు 31వ తేదీతో పాటు జనవరి 1న కూడా రెండ్రోజుల పాటు మద్యం విక్రయ సమయాన్ని పొడిగిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇదే సమయంలో కొత్త సంవత్సర వేడుకల్లో అక్రమ మద్యం, నాటుసారా విక్రయాలపై దృష్టి పెట్టాలని అబ్కారీ శాఖను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని