Andhra News: గవర్నర్‌ను ఎందుకు కలిశారు? ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘానికి నోటీసులు
ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం (ఏపీజీఈఏ) ఇటీవల గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌ను కలవడంపై రాష్ట్ర ప్రభుత్వం వివరణ కోరింది.
అమరావతి: ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం (ఏపీజీఈఏ) ఇటీవల గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌ను కలవడంపై రాష్ట్ర ప్రభుత్వం వివరణ కోరింది. ఈ మేరకు ఆ సంఘానికి నోటీసులు జారీ చేసింది. మీడియా, పత్రికల్లో వచ్చిన వార్తల ఆధారంగా నోటీసులు ఇస్తున్నట్లు పేర్కొంది. వేతనాలు, ఆర్థిక అంశాలపై ప్రభుత్వాన్ని సంప్రదించే ప్రత్యామ్నాయ మార్గాలు ఉండగా.. ఎందుకు కలిశారని ఆ సంఘాన్ని ప్రభుత్వం ప్రశ్నించింది. గవర్నర్‌ను కలిసి ఫిర్యాదు చేయడం రోసా నిబంధనలకు విరుద్ధమని.. సంఘం గుర్తింపు ఎందుకు రద్దు చేయకూడదో వారంలోపు చెప్పాలని ఆదేశించింది.
ప్రభుత్వ ఉద్యోగులకు సమయానికి జీతభత్యాలు అందేలా చట్టం చేయాలని కోరుతూ ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ ఆధ్వర్యంలో నేతలు ఇటీవల గవర్నర్‌ను కలిశారు. ఉద్యోగులకు చెల్లించాల్సిన ఆర్థిక ప్రయోజనాల విషయంలో ప్రభుత్వం ఉల్లంఘనలకు పాల్పడుతోందని ఆయనకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో దీనిపై వివరణ కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆ సంఘానికి నోటీసులు జారీ చేసింది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
APSLPRB: కానిస్టేబుల్ ప్రాథమిక పరీక్ష ఫలితాలు విడుదల.. రిజల్ట్స్ కోసం క్లిక్ చేయండి
-
Politics News
Aaditya Thackeray: రాజీనామా చేసి నాపై పోటీ చెయ్.. సీఎంకు ఆదిత్య సవాల్!
-
Sports News
IND vs AUS: ఇయాన్ హీలీ ‘పిచ్’ వ్యాఖ్యలకు జాన్ రైట్ కౌంటర్..
-
Politics News
Kotamreddy: నాకు రఘురామ కంటే పదింతల వేధింపులు ఉంటాయి: కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి
-
Movies News
Allu Aravind: నా కోడలు స్నేహకు పని చేయాల్సిన అవసరం లేదు కానీ..: అల్లు అరవింద్
-
World News
US-Mexico: భారతీయుడైతే 21 వేల డాలర్లు