Andhra news : ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు పెంపుపై ఆర్డినెన్స్‌ జారీ

ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ పెంపు అంశంపై ఏపీ ప్రభుత్వం మరో అడుగుముందుకేసింది. రిటైర్‌మెంట్‌ వయస్సును 62 ఏళ్లకు పెంచుతూ ఆర్డినెన్స్‌ జారీ చేసింది. జనవరి 2022 జనవరి 1 నుంచి...

Published : 31 Jan 2022 16:12 IST

అమరావతి: ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ పెంపు అంశంపై ఏపీ సర్కార్‌ మరో అడుగు ముందుకేసింది. రిటైర్మెంట్‌ వయస్సును 62 ఏళ్లకు పెంచుతూ ఆర్డినెన్స్‌ జారీ చేసింది. 2022 జనవరి 1 నుంచి ఉత్తర్వులు అమలు చేయాలని నిర్ణయించింది. నూతన పీఆర్సీ జీవోల విడుదల సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 62 ఏళ్లకు పెంచుతామని ఏపీ ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆర్డినెన్స్‌ జారీ చేశారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో దీనికి చట్టబద్ధత కల్పించనున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని