Water issue: శ్రీశైలంలో విద్యుత్‌ ఉత్పత్తి ఆపాలని కృష్ణానది యాజమాన్య బోర్డుకు ఏపీ లేఖ

శ్రీశైలం జలాశయంలో తెలంగాణ విద్యుత్‌ ఉత్పత్తిని నిలిపివేసేలా చూడాలని కృష్ణానది యాజమాన్య బోర్డుకు ఏపీ ప్రభుత్వం లేఖ రాసింది. విద్యుత్‌ ఉత్పతి వల్ల నీటిమట్టం తగ్గుతోందని ఆందోళన వ్యక్తం చేసింది. నీటిమట్టం 854 అడుగులకు చేరితే రాయలసీమకు నీరు ఇవ్వలేమని లేఖలో ఏపీ ఈఎన్‌సీ

Updated : 19 Aug 2021 10:26 IST

అమరావతి: శ్రీశైలం జలాశయంలో తెలంగాణ విద్యుత్‌ ఉత్పత్తిని నిలిపివేసేలా చూడాలని కృష్ణానది యాజమాన్య బోర్డుకు ఏపీ ప్రభుత్వం లేఖ రాసింది. విద్యుత్‌ ఉత్పతి వల్ల నీటిమట్టం తగ్గుతోందని ఆందోళన వ్యక్తం చేసింది. నీటిమట్టం 854 అడుగులకు చేరితే రాయలసీమకు నీరు ఇవ్వలేమని లేఖలో ఏపీ ఈఎన్‌సీ పేర్కొన్నారు. చెన్నైకి కూడా తాగునీటిని సరఫరా చేయలేమని తెలిపారు. విద్యుత్‌ ఉత్పాదనతో వస్తున్న నీటిని సాగర్‌లో నిలపలేమని ఈఎన్‌సీ పేర్కొన్నారు. సాగర్‌లో పూర్తిస్థాయి నీటిమట్టం ఉందని, విద్యుత్‌ ఉత్పాదనలో కిందికి విడిచిపెట్టిన నీటిని తెలంగాణ కోటానుంచి మినహాయించాలని ఏపీ లేఖలో పేర్కొంది. 
 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని