
AP High Court: పీఆర్సీ జీవోలపై పిటిషన్.. విచారణకు స్వీకరించిన హైకోర్టు
అమరావతి: ఏపీలో ఇటీవల విడుదలైన పీఆర్సీ జీవోలకు సంబంధించి దాఖలైన పిటిషన్‌ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. సర్వీస్ బెనిఫిట్స్ తగ్గించడంపై ఏపీ గెజిటెడ్ ఆఫీసర్స్ ఐకాస అధ్యక్షుడు కెవీ కృష్ణయ్య ఉన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. ప్రతివాదులుగా ఏపీ ప్రభుత్వం, ఆర్థిక, రెవెన్యూ ముఖ్యకార్యదర్శులు, కేంద్ర ప్రభుత్వం, పే రివిజన్ కమిషన్‌ను చేర్చారు. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన హైకోర్టు వచ్చే సోమవారం విచారణ జరపనుంది.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.