AP HighCourt: మూడు రాజధానులు, సీఆర్డీఏ రద్దు బిల్లులుపై విచారణ వాయిదా

మూడు రాజధానులు, సీఆర్డీఏ రద్దు బిల్లులపై హైకోర్టులో..

Published : 28 Jan 2022 18:09 IST

అమరావతి: మూడు రాజధానులు, సీఆర్డీఏ రద్దు బిల్లులపై హైకోర్టులో విచారణ జరిగింది. ఇప్పటికే రెండు బిల్లులను రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. వెనక్కి తీసుకున్న బిల్లులపై విచారణ జరపాలా? వద్దా? దానిపై విచారణ చేపట్టింది. హైకోర్టులో పిటిషనర్ల తరఫున న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ.. మూడు రాజధానులు, సీఆర్డీఏ రద్దు బిల్లులపై విచారణ కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు. తుది తీర్పు ఇవ్వకపోతే ప్రభుత్వం మళ్లీ బిల్లులు పెడుతుందని న్యాయవాదులు వాదించారు. రాజధానిలో కనీసం అభివృద్ధి పనులు చేపట్టలేదన్నారు. అమరావతి కార్పొరేషన్‌ పేరిట గ్రామ సభలు జరపాలని న్యాయవాదులు కోరారు. తదుపరి విచారణను వచ్చే నెల 2కి హైకోర్టు ధర్మాసనం వాయిదా వేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని