AP High Court: నరేగా బిల్లుల చెల్లింపు వ్యవహారం.. 102 ఏపీ ప్రభుత్వ పిటిషన్ల కొట్టివేత
మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం (నరేగా) బిల్లుల చెల్లింపు విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాఖలు చేసిన రివ్యూ పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. నరేగా పథకం కింద తమకు చెల్లించాల్సిన బిల్లులు పెండింగ్లో ఉన్నాయని గతంలో కాంట్రాక్టర్లు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు.
అమరావతి: మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం (నరేగా) బిల్లుల చెల్లింపు వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాఖలు చేసిన రివ్యూ పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. నరేగా పథకం కింద తమకు చెల్లించాల్సిన బిల్లులు పెండింగ్లో ఉన్నాయని గతంలో కాంట్రాక్టర్లు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. పిటిషన్లపై విచారణ చేపట్టిన ధర్మాసనం పెండింగ్ బిల్లులు చెల్లించాలని గతంలోనే తీర్పునిచ్చింది. ఉన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం 102 రివ్యూ పిటిషన్లు దాఖలు చేసింది. కాంట్రాక్టర్లు పెద్ద మొత్తంలో బిల్లులు పెట్టారని.. దానికి సంబంధించిన ఆధారాలు తమవద్ద ఉన్నాయని ప్రభుత్వం తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. పిటిషన్లను రివ్యూ చేయాలని కోరారు. గతంలో పూర్తి స్థాయిలో పరిశీలించిన తర్వాతే ఎమ్ బుక్ ఎంట్రీ చేస్తారు కదా అని ప్రభుత్వ న్యాయవాదిని న్యాయస్థానం ప్రశ్నించింది. వాదనలు విన్న ధర్మాసనం 102 రివ్యూ పిటిషన్లను కొట్టివేస్తూ తీర్పు వెల్లడించింది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Eamcet exam: తెలంగాణలో మే 7 నుంచి 14 వరకు ఎంసెట్ పరీక్ష
-
Crime News
Uttar Pradesh: యూపీలో ఘోరం.. మృతదేహాన్ని 10 కిలోమీటర్లు ఈడ్చుకెళ్లిన కారు!
-
India News
JEE Main 2023: జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థుల జయభేరి!
-
General News
Ts High court: ఎమ్మెల్యేలకు ఎర కేసు.. విచారణ చేసేందుకు సీజే అనుమతి కోరండి: హైకోర్టు
-
India News
Mumbai airport: ముంబయి ఎయిర్పోర్టుకు ఉగ్ర బెదిరింపులు
-
India News
PM-KISAN: పీఎం-కిసాన్ మొత్తం పెంపుపై కేంద్రం క్లారిటీ