Andhra News: కోర్టు ఉత్తర్వులంటే లెక్కలేదా?.. ఏమవుతుందిలే అని బరితెగింపా?: ఏపీ హైకోర్టు

70 కోర్టుధిక్కరణ కేసుల్లో ఐఏఎస్‌లు జీకే ద్వివేది, ఎస్.ఎస్‌ రావత్‌ హాజరుకావటంపై న్యాయస్థానం విస్మయం వ్యక్తం చేసింది. కోర్టు ఉత్తర్వులంటే లెక్కలేదా?.. ఏమవుతుందిలే అని బరితెగింపా? అని ఘాటుగా వ్యాఖ్యానించింది.

Updated : 03 Feb 2023 21:46 IST

అమరావతి: ఉపాధిహామీ బిల్లుల చెల్లింపు కేసులో ఐఏఎస్‌ అధికారులపై హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఉపాధి హామీ పథకం కింద చేసిన పనులకు బిల్లులు చెల్లించాలని గతంలో హైకోర్టు ఆదేశించినా.. అధికారులు చెల్లించలేదంటూ ఓ కాంట్రాక్టర్‌ హైకోర్టులో కోర్టు ధిక్కరణ పిటిషన్‌ దాఖలు చేశారు. పిటిషన్‌పై విచారించిన ధర్మాసనం ఈరోజు సంబంధిత అధికారులు కోర్టుకు హాజరుకావాలని గత విచారణలో ఆదేశించింది. ఈకేసులో సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులు గోపాలకృష్ణ ద్వివేది, ఎస్‌.ఎస్‌.రావత్‌ , దినేష్‌ కుమార్‌ శుక్రవారం హైకోర్టుకు హాజరయ్యారు.

ఇందులో ద్వివేది, రావత్‌ 70 కోర్టు ధిక్కరణ కేసుల్లో న్యాయస్థానానికి హాజరుకావటంపై హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. ఇన్ని కేసులు నమోదవుతున్నాయంటే.. కోర్టు ఉత్తర్వులంటే అంత లెక్కలేని తనం ఎందుకని న్యాయస్థానం నిలదీసింది. ఏమవుతుందిలే అని బరితెగింపు ప్రదర్శిస్తే.. ఊరుకుంటామనే భ్రమల్లో అధికారులు ఉండొద్దని కోర్టు హెచ్చరికలు చేసింది. రోజూ మిమ్మల్నే చూడటానికి న్యాయస్థానానికే చికాకు వేస్తోందని ఐఏఎస్‌ అధికారులను ఉద్దేశించి కోర్టు వ్యాఖ్యానించింది. దేశంలో కల్లా ఏపీలోనే కోర్టు ధిక్కరణ కేసులు ఏపీలోనే ఎక్కువగా ఉన్నాయన్న ధర్మాసనం.. అధికారుల తీరే ఇందుకు కారణమని స్పష్టం చేసింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని