AP High court: అధికారుల వైఖరి దురదృష్టకరం.. వారిని జైలుకు పంపాలి: హైకోర్టు

ప్రభుత్వ అధికారులు కోర్టు ఆదేశాలను పట్టించుకోవడం లేదని హైకోర్టు మండిపడింది. కోర్టు ఆదేశాల అమలులో అధికారుల నిర్లక్ష్య ధోరణి స్పష్టంగా కనిపిస్తోందని వ్యాఖ్యానించింది.

Updated : 31 Mar 2023 20:21 IST

అమరావతి: ప్రభుత్వ అధికారులు కోర్టు ఆదేశాలను పట్టించుకోవడం లేదని హైకోర్టు మండిపడింది. కోర్టుకు హాజరు కావాలని ఆదేశిస్తేనే అధికారులు స్పందించి పనులు చేస్తున్నారని విచారణ సందర్భంగా హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. రెండు వేర్వేరు కోర్టు ధిక్కరణ కేసుల్లో పలువురు ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులు హైకోర్టుకు హాజరయ్యారు. దంత వైద్య కళాశాలలో ఒప్పంద ఉద్యోగిగా పనిచేస్తున్న అరుణ అనే మహిళ.. తనకు 2018 నుంచి జీతం ఇవ్వట్లేదని హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. జీతం ఇవ్వాలని ఆదేశాలు ఉన్నప్పటికీ అధికారులు అమలు చేయడం లేదని కోర్టు ధిక్కరణ పిటిషన్‌ దాఖలు చేశారు. దీనికి సంబంధించి ప్రస్తుతం సీఎంవో కార్యదర్శిగా ఉన్న పూనం మాలకొండయ్య, హెల్త్‌ యూనివర్సిటీ వీసీ బాబ్జీ కోర్టుకు హాజరయ్యారు.

ఒప్పంద ఉద్యోగి అరుణకు హెచ్‌ఆర్‌ఏ, డీఏతో కలిపి పూర్తి వేతనం చెల్లించకుండా.. కొంత మొత్తం ఎలా చెల్లిస్తారని ఉన్నత న్యాయస్థానం అధికారులను ప్రశ్నించింది. ఇన్నేళ్లు జీతం ఇవ్వకపోతే అమెకు జీవనోపాధి ఎలా అని నిలదీసింది. ఆమె ఉద్యోగం వదిలేసి వెళ్లి పోయేలా చేస్తున్నారనే అభిప్రాయం వ్యక్తం చేసింది. అధికారులు ఈ విధంగా వ్యవహరించడం సరికాదని, కోర్టు ధిక్కరణకు పాల్పడే అధికారుల కోసం హైకోర్టులో ప్రత్యేక సెల్‌ ఏర్పాటు చేసి జైలుకు పంపించాల్సి వస్తుందేమోనని ఉన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. మరో కోర్టు ధిక్కరణ కేసులో హోంశాఖ ముఖ్య కార్యదర్శి విశ్వజిత్‌, మాజీ డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ హాజరయ్యారు.
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని