Andhra News: సీఐడీ కేసు.. మాజీ మంత్రి నారాయణకు హైకోర్టులో ఊరట

మాజీ మంత్రి పొంగూరు నారాయణకు ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఉన్నత న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

Published : 26 May 2022 15:59 IST

అమరావతి: మాజీ మంత్రి పొంగూరు నారాయణకు ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఉన్నత న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అమరావతి రింగ్‌ రోడ్డు భూ సమీకరణలో అక్రమాలు జరిగాయంటూ కొద్దిరోజుల క్రితం వైకాపా ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఏపీ సీఐడీకి ఫిర్యాదు చేశారు. దీనిపై ఇటీవల ఏపీ సీఐడీ కేసు నమోదు చేసింది.

ఈ నేపథ్యంలో నారాయణతో పాటు లింగమనేని సోదరులు, రామకృష్ణ కన్‌స్ట్రక్షన్స్‌ హైకోర్టును ఆశ్రయించాయి. విచారణ జరిపిన న్యాయస్థానం పిటిషనర్లపై తొందరపాటు చర్యలు వద్దని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అనంతరం తదుపరి విచారణను జూన్‌ 9కి వాయిదా వేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని