Andhra News: ఎంపీ కేశినేని నాని పిటిషన్‌కు విచారణ అర్హత ఉంది: ఏపీ హైకోర్టు

ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం కొండపల్లి నగర పంచాయతీలో ఎంపీ కేశినేని నాని తన ఓటు హక్కు వినియోగించుకోవడంపై హైకోర్టు విచారణ జరిపింది.  ఈ పిటిషన్‌కుఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం కొండపల్లి నగర పంచాయతీలో ఎంపీ కేశినేని నాని తన ఓటు హక్కు వినియోగించుకోవడంపై హైకోర్టు విచారణ జరిపింది.  ఈ పిటిషన్‌కు

Published : 11 Aug 2022 20:10 IST

అమరావతి: ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం కొండపల్లి నగర పంచాయతీలో ఎంపీ కేశినేని నాని తన ఓటు హక్కు వినియోగించుకోవడంపై హైకోర్టు విచారణ జరిపింది.  ఈ పిటిషన్‌కు విచారణ అర్హత లేదని కొండపల్లి వైకాపా కౌన్సిలర్‌ల తరఫున వేసిన పిటిషన్‌పై కూడా హైకోర్టులో విచారణ జరిగంది. ఇలాంటి పిటిషన్‌లకు హైకోర్టులో విచారణ అర్హత లేదని, సివిల్‌ కోర్టుకు వెళ్లాలని వైకాపా కౌన్సిలర్‌ల తరఫున న్యాయవాది సీతారాం వాదనలు వినిపించారు. 

పిటిషన్‌లకు విచారణ అర్హత ఉందని కేశినేని నాని, తెదేపా కౌన్సిలర్‌ల తరఫు న్యాయవాది అశ్వినీకుమార్‌ వాదనలు వినిపించారు. సుప్రీంకోర్టు ఇచ్చిన పలు రూలింగ్‌లను ఈ సందర్భంగా ధర్మాసనం దృష్టికి తెచ్చారు. ఇరు వర్గాల వాదనల అనంతరం కేశినేని పిటిషన్‌కు విచారణ అర్హత ఉందని హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. ఎంపీ కేశినేని ఓటు చెల్లుతుందా లేదా అనే అంశంపై తదుపరి విచారణలో తేలుస్తామని హైకోర్టు స్పష్టం చేసింది. తదుపరి విచారణను ధర్మాసనం 3 వారాలకు వాయిదా వేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని