ఏపీ హైకోర్టు తరలింపుపై కేంద్రం స్పందన

ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు తరలింపు నిర్ణయం ప్రస్తుతం ఏపీ హైకోర్టు (సబ్‌ జ్యూడీస్‌)పరిధిలో ఉందని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.

Updated : 04 Feb 2021 13:39 IST

దిల్లీ: ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు తరలింపు నిర్ణయం ప్రస్తుతం ఏపీ హైకోర్టు (సబ్‌ జ్యూడీస్‌)పరిధిలో ఉందని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. అమరావతి నుంచి ఏపీ హైకోర్టును కర్నూలుకు తరలిస్తున్నారా? అని రాజ్యసభ సభ్యుడు జీవీఎల్‌ నరసింహారావు అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. గతేడాది ఫిబ్రవరిలో హైకోర్టు తరలింపునకు ఏపీ సీఎం జగన్‌ ప్రతిపాదనలు పంపారని తెలిపారు.  ఉన్నత న్యాయస్థానం తరలింపుపై హైకోర్టు, రాష్ట్ర ప్రభుత్వాలదే నిర్ణయమని పేర్కొన్నారు. హైకోర్టు నిర్వహణ ఖర్చు బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని రవిశంకర్‌ ప్రసాద్‌ స్పష్టం చేశారు. తరలింపుపై రాష్ట్ర ప్రభుత్వం, హైకోర్టు ఏకాభిప్రాయానికి రావాల్సి ఉంటుందని, దీని కోసం ఎలాంటి గడువూ లేదని స్పష్టం చేశారు. తరలింపు వ్యవహారం పూర్తిగా హైకోర్టు పరిధిలోనే ఉందన్నారు.

కర్నూలులో హైకోర్టు, విశాఖలో సచివాలయం, అమరావతిలో శాసనసభ ఏర్పాటు చేయడం ద్వారా రాష్ట్రంలో మూడు రాజధానులు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుండగా.. ఆమరావతినే ఏకైక రాజధానిగా ప్రకటించాలని కోరుతూ రాజధానికి భూములిచ్చిన రైతులు, ప్రతిపక్ష పార్టీలు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హైకోర్టు తరలింపుపై కేంద్రం తన వైఖరిని స్పష్టం చేసింది.

ఇవీ చదవండి...

అచ్చెన్న బెయిల్‌ పిటిషన్‌పై విచారణ వాయిదా

ఏకగ్రీవాలు శ్రుతిమించితే అధికారుల వైఫల్యమే

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని