AP High Court: అయ్యన్నపై తదుపరి చర్యలొద్దు: హైకోర్టు

తెదేపా సీనియర్‌ నేత అయ్యన్నపాత్రుడికి హైకోర్టులో ఊరట లభించింది. పశ్చిమ గోదావరి జిల్లా నల్లజర్ల పోలీసులు

Updated : 24 Feb 2022 13:46 IST

అమరావతి: తెదేపా సీనియర్‌ నేత అయ్యన్నపాత్రుడికి హైకోర్టులో ఊరట లభించింది. పశ్చిమ గోదావరి జిల్లా నల్లజర్ల పోలీసులు తనపై నమోదు చేసిన కేసు కొట్టి వేయాలని అయ్యన్న క్వాష్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై ఉన్నత న్యాయస్థానం విచారణ జరిపింది. అయ్యన్నపై తదుపరి చర్యలు నిలిపి వేయాలని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. 

అసలేం జరిగిందంటే..

అయ్యన్నపాత్రుడిపై నల్లజర్ల పోలీసులు సెక్షన్‌ 41(ఎ) నోటీసులు జారీ చేశారు. నల్లజర్లలో ఈ నెల 18న ఎన్టీఆర్‌ విగ్రహాష్కరణ సభలో సీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేశారని స్థానిక వైకాపా నాయకుడు రామకృష్ణ ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. ఈ మేరకు నిన్న విశాఖ జిల్లా నర్సీపట్నం వచ్చిన పోలీసులు అయ్యన్నపాత్రుడు ఇంటికి నోటీసులు అంటించారు.

మరోవైపు నిన్నటి నుంచి పోలీసులు అయ్యన్న ఇంటే వద్దే ఉండటంతో ఆయనను అరెస్టు చేస్తారనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో నియోజకవర్గంలోని పలు ప్రాంతాల నుంచి తెదేపా నాయకులు, కార్యకర్తలు అయ్యన్న ఇంటికి తరలివచ్చిన విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని