AP High Court: రుషికొండ తవ్వకాలు.. ఏపీ ప్రభుత్వం ఏదో దాచిపెడుతోంది: హైకోర్టు

విశాఖపట్నంలోని రుషికొండ తవ్వకాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఏదో దాస్తోందని ఏపీ హైకోర్టు వ్యాఖ్యానించింది. తవ్వకాలపై కేంద్ర అటవీశాఖ కమిటీ వేస్తామంటే ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించింది.

Published : 13 Oct 2022 13:55 IST

అమరావతి: విశాఖపట్నంలోని రుషికొండ తవ్వకాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఏదో దాస్తోందని ఏపీ హైకోర్టు వ్యాఖ్యానించింది. తవ్వకాలపై కేంద్ర అటవీశాఖ కమిటీ వేస్తామంటే ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించింది. రుషికొండ తవ్వకాలపై తెదేపా ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబుతో పాటు మరొకరు దాఖలు చేసిన పిటిషన్‌పై ఉన్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది.

రుషికొండపై 9.88 ఎకరాలకు అనుమతిస్తే 20 ఎకరాల్లో తవ్వకాలు జరిపారంటూ పిటిషనర్‌ తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీనికి సంబంధించిన గూగుల్‌ మ్యాప్‌ను సమర్పించారు. అనంతరం ప్రభుత్వం తరఫున న్యాయవాది నిరంజన్‌ రెడ్డి వాదనలు వినిపిస్తూ అనుమతి ఉన్న మేరకే తవ్వకాలు చేస్తున్నట్లు చెప్పారు. దీనిపై న్యాయమూర్తి స్పందిస్తూ ఫొటోలు అబద్ధాలు చెబుతాయా? అని ప్రశ్నించారు. తమకు కొంత సమయం కావాలని.. దీనిపై అఫిడవిట్‌ దాఖలు చేస్తామని చెప్పారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ ప్రభుత్వం ఏదో దాస్తున్నట్లు అనిపిస్తోందన్నారు. అనంతరం తదుపరి విచారణను నవంబర్‌ 3కి వాయిదా వేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని