
AP news: పంచ్ ప్రభాకర్‌ని ఎలా పట్టుకుంటున్నారో చెప్పండి: హైకోర్టు ఆగ్రహం
అమరావతి: న్యాయమూర్తులపై అనుచిత వ్యాఖ్యల కేసులో ఏపీ హైకోర్టులో మరోసారి విచారణ జరిగింది. రిజిస్ట్రార్ జనరల్ నుంచి లేఖ వచ్చిన వెంటనే పంచ్ ప్రభాకర్ పోస్టులను యూట్యూబ్, ఫేస్‌బుక్, ట్విటర్ తొలగించాయని, అలాగే అకౌంట్‌ని బ్లాక్ చేశారని స్టాండింగ్ కౌన్సిల్ అశ్వినీకుమార్ ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. ఈ అంశంపై తాము కూడా లేఖ రాసినట్టు సీబీఐ తెలిపింది. దీనిపై స్పందించిన హైకోర్టు ధర్మాసనం.. లేఖ రాసి ఉపయోగం ఏంటని ప్రశ్నించింది. పంచ్ ప్రభాకర్‌ని ఎలా పట్టుకుంటున్నారో చెప్పాలని కోరింది. ఇందుకు సీబీఐ నుంచి ఎలాంటి సమాధానం రాకపోవడంతో ఆగ్రహం వ్యక్తంచేసింది. కోర్టు చెప్పింది వినకపోతే మీరు చెప్పేది వినాల్సిన అవసరం లేదని హైకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ కేసులో ప్రాసిక్యూషన్ ఏం చేయాలో తామే ఆదేశాలిస్తామని స్పష్టంచేసింది. అవసరమైతే ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసే యోచన చేస్తామని తెలిపింది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.