Andhra Pradesh: శ్రీశైలం ట్రస్ట్‌బోర్డు ప్రమాణస్వీకారంపై హైకోర్టు స్టే

శ్రీశైలం ట్రస్ట్‌ బోర్డు ప్రమాణస్వీకారంపై ఏపీ హైకోర్టు స్టే ఇచ్చింది. ట్రస్ట్‌ బోర్డు నియామకాన్ని సవాల్‌ చేస్తూ కొర్రా శ్రీనివాసులు నాయక్‌ అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌పై

Updated : 11 Feb 2022 15:55 IST

అమరావతి: శ్రీశైలం ట్రస్ట్‌ బోర్డు ప్రమాణస్వీకారంపై ఏపీ హైకోర్టు స్టే ఇచ్చింది. ట్రస్ట్‌ బోర్డు నియామకాన్ని సవాల్‌ చేస్తూ కొర్రా శ్రీనివాసులు నాయక్‌ అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన ఉన్నత న్యాయస్థానం.. ట్రస్టు బోర్డ్‌ సభ్యుల ప్రమాణస్వీకారాన్ని వాయిదా వేయాలంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ట్రస్టు బోర్డు ఏర్పాటులో నిబంధనలు పాటించలేదని పిటిషనర్‌ తరఫు న్యాయవాది వాదించారు. ట్రైబల్ చరిత్ర కలిగిన దేవాలయంలో గిరిజనులకు ప్రాతినిధ్యం లేకపోవడంపై అభ్యంతరం వ్యక్తంచేశారు .నిబంధనల ప్రకారం ఇద్దరు హిందూ ధార్మిక తాత్వికవేత్తలు ఉండాలని.. కానీ ట్రస్ట్ బోర్డ్‌లో లేరన్నారు. ఆలయంపై అవగాహన లేనివారు సభ్యులుగా ఉన్నారని ఆవేదన వ్యక్తంచేశారు. వాదనల అనంతరం మూడు వారాల వరకు బోర్డు సభ్యుల ప్రమాణస్వీకారంపై హైకోర్టు స్టే విధించింది. తదుపరి విచారణను వచ్చే బుధవారానికి వాయిదా వేసింది. ఇటీవల 15 మందితో ట్రస్టు బోర్డు సభ్యులను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నెల 14న ట్రస్ట్‌ సభ్యులు ప్రమాణస్వీకారోత్సవం జరగాల్సి ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని