AP News: 12శాతం వడ్డీతో ఉపాధి హామీ పథకం బిల్లులు చెల్లించాలి: హైకోర్టు

ఉపాధిహామీ పథకం బిల్లుల చెల్లింపుపై ఏపీ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. మొత్తం 1,013 పిటిషన్లపై విచారణ చేపట్టిన ధర్మాసనం మంగళవారం తీర్పు వెల్లడించింది

Updated : 05 Oct 2021 16:26 IST

అమరావతి: ఉపాధిహామీ పథకం బిల్లుల చెల్లింపుపై ఏపీ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. మొత్తం 1,013 పిటిషన్లపై విచారణ చేపట్టిన ధర్మాసనం మంగళవారం తీర్పు వెల్లడించింది.  నాలుగు వారాల్లో పెండింగ్‌ బిల్లులు చెల్లించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. 20శాతం తగ్గించి చెల్లిస్తామన్న ప్రభుత్వ జీవోను ధర్మాసనం కొట్టివేసింది. బకాయిలను ఏడాదికి 12శాతం వడ్డీతో సహా చెల్లించాలని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఉత్తర్వులు అమలు చేయకుంటే కోర్టు ధిక్కరణ చర్యలకు వెనుకాడబోమని హైకోర్టు తెలిపింది. 20శాతం మేర బిల్లుల తగ్గింపు సర్క్యులర్లను కొట్టివేస్తున్నట్టు ధర్మాసనం ప్రకటించింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని